Mon Dec 23 2024 10:31:49 GMT+0000 (Coordinated Universal Time)
వేగంగా విస్తరిస్తోన్న కొత్తవేరియంట్.. వాళ్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలి
తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రులు కూడా జ్వరం బాధితులతో కిట కిటలాడుతున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో..
భారత్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే.. కరోనా మళ్లీ పంజా విప్పినట్లే కనిపిస్తోంది. రోజువారీ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. ముఖ్యంగా దేశంలోని కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ లలో కరోనా యాక్టివ్ కేసులు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
పెరుగుతున్న కేసులకు H3N2 కూడా కారణం కావొచ్చని నిపుణులు పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే xbb 1.16 వేరియంట్ వల్ల కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లోకేసుల సంఖ్య పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రులు కూడా జ్వరం బాధితులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో చాలామంది చికిత్స కోసం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. అయితే xbb 1.16 వేరియంట్ వల్ల కేసులు పెరిగినా మరణాలు రేటు అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలు, వయసు పై బడిన వారు జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయరాదని సూచిస్తున్నారు. ప్రజలు కూడా బయటికి వెళ్లేటపుడు మాస్కులను వాడాలని తెలిపారు.
Next Story