Fri Nov 22 2024 20:28:17 GMT+0000 (Coordinated Universal Time)
కోవిడ్ కు ట్యబ్లెట్... 63 రూపాయలు మాత్రమే
కోవిడ్ కు కొత్తగా మాత్ర వచ్చేసింది. ఈ ట్యాబ్లెట్ ను ప్రముఖ ఔషధ సంస్థ ఆప్టిమన్ ఫార్మా రూపొందించింది
కోవిడ్ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. కాస్త జలుబు, దగ్గు వస్తే వెంటనే పరీక్షల కోసం పరుగులు తీస్తున్నారు. పరీక్ష ఫలితం వచ్చిన దాకా టెన్షన్ తప్పడం లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ ను రెండు డోసులు వేసుకున్న వారిని కూడా ఈ భయం వీడటం లేదు. అయితే కోవిడ్ కు కొత్తగా మాత్ర వచ్చేసింది. ఈ ట్యాబ్లెట్ ను ప్రముఖ ఔషధ సంస్థ ఆప్టిమన్ ఫార్మా రూపొందించింది. దీనిని మూడు దశల్లో పరీక్ష చేశారు.
అన్నీ అనుమతులు....
ఈ ట్యాబ్లెట్ కు డీసీజీఐ అనుమతి కూడా ఇచ్చేసింది. ఈ సంస్థ ట్యాబ్లెట్ కు మోల్నుపిరావిర్ గా పేరుపెట్టింది. ఒక్కొక్క టాబ్లెట్ ధరను 63 రూపాయలుగా నిర్ణయించారు. ఒక్క ప్యాకెట్ లో ఐదు స్ట్రిప్ లు ఉంటాయని, ఇందులో నలభై ట్యాబెట్లు ఉంటాయని సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఈ టాబ్లెట్ ను రోజుకు రెండు డోసులు వినియోగించాలని, కోవిడ్ నుంచి కోలుకుంటారని చెబుతున్నారు.
Next Story