Fri Nov 22 2024 19:37:40 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. భారత్ లోకి కొత్తవేరియంట్
అక్టోబర్ 10వ తేదీ నుంచి 16 తేదీల మధ్య నమోదైన కేసులు.. అంతకుముందు వారంకంటే 17.7 శాతానికి పైగా పెరిగినట్లు..
దేశంలో నిన్న మొన్నటి వరకూ కంట్రోల్ కి వచ్చిన కరోనా.. మళ్లీ పడగవిప్పుతోంది. రోజురోజుకూ వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దసరా సీజన్ లో ప్రయాణాలు ఎక్కువగా ఉండటంతో రోజువారీ కేసులు పెరగడంతో పాటు.. కరోనా కొత్త వేరియంట్, అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్ ఎక్స్ ఎక్స్ బీ ని నిపుణులు గుర్తించారు. ఇది అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ కూడా కావొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. గతవారంలో ముంబై, థానే, పూణే, రాయ్ గడ్ లో ఎక్కువ జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఈ వేరియంట్ బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
అక్టోబర్ 10వ తేదీ నుంచి 16 తేదీల మధ్య నమోదైన కేసులు.. అంతకుముందు వారంకంటే 17.7 శాతానికి పైగా పెరిగినట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఎక్స్ఎక్స్ బీ ఇప్పటి వరకూ 17 దేశాలకు వ్యాపించగా.. బీఏ 2.75, బీజే.1 సబ్-వేరియంట్ల కంటే దీని వృద్ధి ఎక్కువగా ఉందని నిపుణులు భావిస్తున్నారు. గడిచిన 6 నెలల్లో మన దేశంలో బీఏ 2.75 వల్ల 90 శాతం ఇన్ఫెక్షన్లు రాగా.. ఎక్స్ఎక్స్ బీ వల్ల 7 శాతం ఇన్ఫెక్షన్ వ్యాపించినట్లు తేలింది. ఈ వేరియంట్ మానవుడి రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే గుణం కలిగి ఉంటుంది కాబట్టి.. వ్యాప్తి రేటు భారీగా పెరుగుతుందని నిపుణుల అంచనా. ఏదేమైనప్పటికీ వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Next Story