Mon Dec 23 2024 16:32:56 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా నుంచి కోలుకున్నారా ? అయితే ఈ జాగ్రత్తలూ పాటించండి
వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత.. బాధితులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లక్షణాలు
భారత్ లో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. కోవిడ్, ఒమిక్రాన్ లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. కొత్తవేరియంట్ లక్షణాలు కాస్త తక్కువగానే ఉండటంతో.. త్వరగానే వైరస్ నుంచి కోలుకుంటున్నారు బాధితులు. డెల్టా రకంతో పోలిస్తే.. ఒమిక్రాన్ వల్ల ప్రాణహాని చాలా తక్కువగా ఉంది. వ్యాధి నిర్థారణ అయినవారు హోమ్ క్వారంటైన్ లో ఉండి తగినంత విశ్రాంతి తీసుకోవాలని.. మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, చికిత్స తీసుకోవడం వల్ల ఒమిక్రాన్ నుండి విముక్తి పొందవచ్చని వైద్య శాఖ చెబుతోంది.
వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత.. బాధితులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లక్షణాలు తక్కువగా ఉండి.. కోవిడ్ నుంచి త్వరగా కోలుకున్నవారు ఐదురోజుల పాటు సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. ఆ ఐదురోజులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలిపింది. కరోనా లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నవారు లక్షణాలు కనిపించిన మొదటి రోజు నుండి పది రోజుల వరకు ఐసోలేషన్ లో ఉండాలి. 20 రోజులపాటు హోమ్ క్వారంటైన్ లో ఉండి.. తగిన విశ్రాంతి తీసుకుంటూ కరోనా నిబంధనలు పాటించాలి. అయితే వీరు కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎలా ఉండాలి అనే మార్గదర్శకాలను CDC జారీ చేయలేదు.
Next Story