Mon Dec 23 2024 11:14:53 GMT+0000 (Coordinated Universal Time)
కొవిన్ పోర్టల్ డేటా లీకులపై స్పందించిన కేద్రం..
కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారి ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నారు వంటి..
కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకునే ప్రజల కోసం రూపొందించిన కొవిన్ పోర్టల్ లోని ప్రజల వ్యక్తిగత సమాచారం లీకైందంటూ వార్తలొచ్చాయి. సున్నితమైన డేటా లీకైందని వచ్చిన వార్తలపై కేంద్రం స్పందించింది. ఆరోగ్యశాఖకు చెందిన ఈ పోర్టల్ పూర్తిగా సురక్షితంగా ఉందని తెలిపింది. డేటా అంతా సేఫ్ గా ఉందని స్పష్టం చేసింది. పోర్టల్ లో డేటా లీకైందన్న వార్తల్ని కొట్టిపారేసింది కేంద్రం. ఎలాంటి ఆధారం లేకుండానే డేటా లీకైందని ప్రచారం జరిగినట్లు పేర్కొంది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని సీఈఆర్టీని కేంద్రం కోరింది.
కోవిన్ వ్యాక్సిన్ వేయించుకున్న వారి ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ వ్యాక్సిన్ వేయించుకున్నారు వంటి సమాచారం కొవిన్ పోర్టల్ లో ఉంటుంది. ఆ సమాచారం టెలిగ్రామ్ లోని ఓ బాట్ లో లీకైందని వార్తలొచ్చాయి. వ్యక్తుల డేటా బయటికి వచ్చిందన్న అనంతరం చాట్ బాట్ నిలిచిపోయిందని తెలిసింది. లీకైన డేటాలో పలువురు అధికారులతో పాటు, రాజకీయ నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత వివరాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఆ వార్తలను కేంద్రం కొట్టిపారేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story