Mon Dec 23 2024 00:02:37 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రెండు వెబ్ సిరీస్ లను ఉపసంహరించుకోవాలి : సీపీఐ కూనంనేని
ఓటీటీ ప్లాట్ ఫామ్ ను కూడా వెంటనే సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన వెబ్ సిరీస్ రానా నాయుడుపై తీవ్రదుమారం రేగుతోంది. మార్చి 10న ఓటీటీలోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ పై ఇప్పటికీ విమర్శల వేడి తగ్గలేదు. సినీ పరిశ్రమకు చెందిన వారితో సహా.. తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత ఓటీటీని కూడా సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలన్న వాదన మరోమారు తెరపైకి వచ్చింది. సినీ పరిశ్రమలో వెంకటేష్, రానా తమకున్న గౌరవాన్ని దిగజార్చుకునేలా ఈ సిరీస్ ఉందన్న విమర్శలు ఘాటుగానే వినిపిస్తున్నాయి.
తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘రానా నాయుడు’, ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్లను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ను కూడా వెంటనే సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తెలుగు ప్రజలకు మంచి కుటుంబ చిత్రాలను అందించిన దగ్గుబాటి రామానాయుడు కుటుంబం నుంచి ఇలాంటి వెబ్ సిరీస్ రావడం దురదృష్టకరమన్నారు.
నాలుగు గోడల మధ్య జరిగే దానిని.. ఇలా ఓటీటీ పేరు చెప్పి నలుగురికీ చూపించేశారని పలువురు పెదవి విరుస్తున్నారు. అది వెబ్ సిరీస్ లా లేదని, బ్లూ ఫిల్మ్ లా ఉందని, వెబ్ సిరీస్ అనేకంటే బ్లూ ఫిల్మ్ అనడం సరిగ్గా సరిపోతుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా.. రానా నాయుడు విడుదలకు కొద్దిరోజుల ముందునుంచీ రానా.. ఈ వెబ్ సిరీస్ ను కుటుంబంతో కలిసి చూడొద్దని, బూతులు ఎక్కువగా ఉంటాయని చెబుతూ వచ్చారు. ఆయన చెప్పిందాన్ని బట్టి భాష మాత్రమే బాగోదనుకున్నారు కానీ.. చాలా వరకూ కంటెంట్ అంతా శృంగారంపైనే చిత్రీకరించినట్లు ఉంది.
Next Story