Sat Dec 21 2024 05:49:57 GMT+0000 (Coordinated Universal Time)
జోడో యాత్ర... ఫుల్లు రెస్పాన్స్
ప్రస్తుతం కర్ణాటకలో యాత్రలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది.
భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలో జరుగుతుంది. 29వ రోజుకు పాదయాత్ర చేరుకుంది. ప్రస్తుతం కర్ణాటకలో యాత్రలో రాహుల్ గాంధీ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. రాహుల్ ను చూసేందుకు అధిక సంఖ్యలో జనం యాత్ర వద్దకు చేరుకుంటున్నారు. అందరినీ సాదరంగా రాహుల్ పలకరిస్తున్నారు. వారితో ఫొటోలు దిగుతున్నారు. కొందరు రాహుల్ తో సెల్ఫీలు తీసుకుని మురిసిపోతున్నారు. రాహుల్ యాత్ర వెంట అనేక మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. రోజుకు 25 కిలోమీటర్ల వరకూ రాహుల్ యాత్ర కొనసాగుతుంది.
22వ రోజుకు...
కర్ణాటకలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొననున్నారని తెలిసింది. ఆమె గురువారం యాత్రలో పాల్గొనే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ప్రియాంక గాంధీ కూడా పాదయాత్రలో పాల్గొంటారని తెలిసింది. గత నెల 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమయిన పాదయాత్ర తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొనసాగింది. ప్రస్తుతం 511 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. రాహుల్ పాదయాత్ర కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Next Story