Mon Dec 23 2024 14:14:21 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ ఎయిర్ పోర్టులో 5 వేల వజ్రాలు పట్టివేత
ఢిల్లీ ఎయిర్ పోర్టులో 5 వేల వజ్రాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ ఒకటిన్నర కోటికి పైగానే ఉంటుంది
రోజురోజుకూ బంగారం, వజ్రాల స్మగ్లింగ్ పెరిగిపోతోంది. ఇతర దేశాల నుంచి భారత్ లోకి అక్రమంగా బంగారం, వజ్రాల దందా ఎక్కువవుతోంది. అధికారులకు చిక్కకుండా ఉండేందుకు కొత్త కొత్త వస్తువుల రూపంలో, తలపై పెట్టుకునే విగ్గులో, ఇలా రకరకాలుగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీమొత్తంలో వజ్రాలు పట్టుబడ్డాయి. హాంగ్ కాంగ్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి బ్యాగును కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. భారీగా వజ్రాలు లభ్యమయ్యాయి.
స్కానింగ్ లో దొరక్కుండా....
తనిఖీల్లో అధికారులకు, స్కానింగ్ లో దొరక్కుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్స్ లో వజ్రాలు ప్యాకింగ్ చేసి, కార్బన్ పేపర్ ను చుట్టారు. అధికారులకు అనుమానం రావడంతో మరోసారి సదరు ప్రయాణికుడి బ్యాగును తనిఖీ చేశారు. దాంతో సుమారు రూ.1.5 కోట్ల విలువైన 5 వేల వజ్రాలు పట్టుబడ్డాయి. వజ్రాలకు సంబంధించిన వివరాలను చెప్పడంలో ప్రయాణికుడు తడబడటంతో.. అతనిపై కేసు నమోదు చేసి, వజ్రాలను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు.
Next Story