Mon Dec 23 2024 15:10:01 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో ఏడు కిలోల బంగారం స్వాధీనం
తమిళనాడులో కస్టమ్స్ అధికారులు బంగారాన్ని పట్టుకున్నారు. శ్రీలంక నుంచి రామేశ్వరానికి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు
తమిళనాడులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. శ్రీలంక నుంచి రామేశ్వరానికి ఈ బంగారాన్ని తరలిస్తుండగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఏడు కేజీల బంగారాన్ని నిందితులు తీసుకెళుతుండగా వాటిని పట్టుకుని విచారణ చేపట్టారు.
శ్రీలంక నుంచి...
ఎక్కువగా బంగారం స్మగ్లింగ్ అవుతుందున్న సమాచారంతోనే కస్టమ్స్ అధికారులు ఈ దాడులు చేసినట్లు తెలిసింది. నిందితుల నుంచి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మాత్రమే వివరాలు బయటపెడతామని అధికారులు చెబుతున్నారు. ఎక్కడి నుంచి ఈ బంగారం తెస్తున్నారు? ఎవరి కోసం దీనిని తరలిస్తున్నారన్న దానిపై విచారణ జరుగుతుంది.
Next Story