Mon Dec 23 2024 15:32:24 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఒక మహిళ నుంచి ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పదిన్నర కిలోల హెరాయిన్ ను పట్టుకున్నారు. దీని విలువ 72 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.దుబాయ్ లో ఒక మహిళ తనకు ఈ పార్సిల్ ఇచ్చిందని మహిళ చెబుతోంది.
న్యూఇయర్ వేడుకల కోసమే.....
నూతన సంవత్సర వేడుకల కోసమే ఈ డ్రగ్స్ ను తెచ్చినట్లు అనుమానిస్తున్నారు. తనకు ఏం సంబధం లేదని నిందితురాలు చెబుతున్నారు. పోలీసులు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని మహిళను విచారిస్తున్నారు.
Next Story