Fri Nov 22 2024 19:25:36 GMT+0000 (Coordinated Universal Time)
దూసుకొస్తున్న బిపోర్ జాయ్ .. 67 రైళ్లు రద్దు
జూన్ 15వ తేదీకి ఈ తుపాను గుజరాత్ తీరప్రాంతాలైన సౌరాష్ట్ర, కచ్ వద్ద తీరం దాటనుంది. బిపోర్ జాయ్ తుపాను..
అరేబియా సముద్రంలో పుట్టుకొచ్చిన బిపోర్ జాయ్ తుపాను గుజరాత్ తీరంవైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం గుజరాత్ లోని పోర్ బందర్ కు నైరుతి దిశగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. జూన్ 15వ తేదీకి ఈ తుపాను గుజరాత్ తీరప్రాంతాలైన సౌరాష్ట్ర, కచ్ వద్ద తీరం దాటనుంది. బిపోర్ జాయ్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడంతో.. ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమ రైల్వే మంగళవారం 67 ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. వీటిలో 5 ఎక్స్ ప్రెస్ రైళ్లు ముంబైకి చెందినవే ఉన్నాయి.
జూన్ 14న బయల్దేరవల్సిన రైలు నెం. 22903 బాంద్రా టెర్మినస్-భుజ్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, జూన్ 16న రైలు నెం. 09415 బాంద్రా టెర్మినస్ – గాంధీధామ్ స్పెషల్ ట్రైన్లు కూడా రద్దయ్యాయి. రద్దైన ట్రైన్లకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు త్వరలోనే రిఫండ్ అందజేస్తామని పశ్చిమరైల్వే తెలిపింది. భవ్నగర్ డివిజన్లో 5, రాజ్‌కోట్‌లోని 8, అహ్మదాబాద్ డివిజన్లోని 3 ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు డబ్ల్యూఆర్‌లోని చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు. 50 కిలోమీటర్ల కంటే అధికంగా ఈదురుగాలులు వీస్తే వెంటనే రైళ్లను ఆపివేయాలని స్టేషన్ మాస్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story