Tue Nov 26 2024 05:21:42 GMT+0000 (Coordinated Universal Time)
అతితీవ్ర తుపానుగా బిపోర్ జాయ్.. ఆ తీరానికే ముప్పు
తూర్పుమధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైన ఈ తుపాను గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా..
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్ జాయ్ తుపాను ఉగ్రరూపం దాల్చింది. ఇది ఆదివారం ఉదయానికి అతితీవ్ర తుపానుగా రూపం దాల్చినట్లు భారతవాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. తూర్పుమధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైన ఈ తుపాను గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు తెలిపింది. ఐఎండీ అంచనాల ప్రకారం ఈ తుపాను పాకిస్థాన్, భారత్ లోని కొన్ని ప్రాంతాల వద్ద తీరాన్ని తాకవచ్చని తెలుస్తోంది.
సుమారుగా జూన్ 15 నాటికి బిపోర్ జాయ్ తీరాన్ని తాకుతుందని అంచనా. ఇది ముంబైకి ఉత్తర నైరుతి దిక్కున 530 కిలోమీటర్ల దూరంలో, పోరుబందర్ రేవుకి దక్షిణాన 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సమయం గడిచే కొద్ది తుపాను మరింత తీవ్రమైన పాకిస్థాన్ , గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ వద్ద తీరాన్ని తాకవచ్చని ఐఎండీ అంచనా వేసింది. తుపాను ప్రభావంతో జూన్ 15 వరకూ గుజరాత్ తీరప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని, అలాగే ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తుపాను తీరం దాటేవరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించాయి.
Next Story