Sat Dec 28 2024 03:05:58 GMT+0000 (Coordinated Universal Time)
Remal Cyclone : సముద్రం అల్లకల్లోలం.. భారీగా ఎగిసి పడుతున్న అలలు
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను తీవ్ర తుఫానుగా మారనుంది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను తీవ్ర తుఫానుగా మారనుంది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతుంది. ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపూపారా – వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య రెమాల్ తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలుల వీసే అవాకశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కోల్కత్తా విమానశ్రయం నుంచి అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు.
తుఫాను నేపథ్యంలో..
తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్, నికోబార్ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. రేపటి వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచనలు జారీ చేసింది. దీని ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ మీదుగ ఆవర్తనం.. కేరళ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో పశ్చిమ దిశ నుంచి ఏపీ వైపు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల చెదురు మొదురు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Next Story