Mon Dec 23 2024 16:00:58 GMT+0000 (Coordinated Universal Time)
కలసి వచ్చిన తేదీనే యోగి ప్రమాణం
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాధ్ ప్రమాణస్వీకారాని ఇంకా తేదీ ఖరారు కాలేదు
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాధ్ ప్రమాణస్వీకారాని ఇంకా తేదీ ఖరారు కాలేదు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ రెండోసారి ఘన విజయం సాధించడంతో యోగి ఆదిత్యానాధ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఆయన హోలీ తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం యోగి ఆదిత్యానాధ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
2017లో కూడా....
హోలీ ఈనెల 18వ తేదీన జరుపుకుంటారు. ఆ మరుసటి రోజు ఈ నెల 19వ తేదీన యోగి ఆదిత్యానాధ్ ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. 2017లో కూడా మార్చి 19వ తేదీన యోగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే తేదీన తిరిగి ఆయన సీఎంగా బాధ్యతలను స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈలోపు ఢిల్లీకి వచ్చి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలను కలసి మంత్రి వర్గ కూర్పుపై చర్చించనున్నారు.
Next Story