Mon Dec 23 2024 13:22:04 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో 600 కు చేరువలో ఒమిక్రాన్ కేసులు.. అత్యధికంగా ఢిల్లీలోనే !
భారత్ లో ఒమిక్రాన్ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కి పెరిగిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో
భారత్ లో ఒమిక్రాన్ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కి పెరిగిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో 151 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారని తెలిపింది. అత్యధికంగా ఢిల్లీలో 142 కేసులు నమోదవ్వగా.. 23 మంది కోలుకున్నారు. అలాగే మహారాష్ట్రలో 141 కేసులు నమోదవ్వగా.. 42 మంది ఒమిక్రాన్ నుంచి విముక్తులయ్యారు. ఇక ఏపీలో 6గురికి ఒమిక్రాన్ నిర్థారణ అవ్వగా.. ఒకరు కోలుకున్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ 41 మందికి ఒమిక్రాన్ సోకగా.. 10 మంది చికిత్స ద్వారా కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వివరించింది.
Next Story