Mon Dec 23 2024 03:06:35 GMT+0000 (Coordinated Universal Time)
ప్రైవేటు కార్యాలయాలు మూసివేత.. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ షురూ !
డీడీఎంఏ మినహాయించబడిన కేటగిరీకి చెందినవి తప్ప.. ఢిల్లీలోని అన్ని ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలని ప్రభుత్వం తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఢిల్లీలోని అన్ని ప్రైవేట్ ఆఫీసులను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా ఉద్ధృతి కంట్రోల్ అయ్యేంతవరకూ ప్రైవేట్ కార్యాలయాలు వీలైనంతవరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ కే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.
డీడీఎంఏ మినహాయించబడిన కేటగిరీకి చెందినవి తప్ప.. ఢిల్లీలోని అన్ని ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే రెస్టారెంట్లు, బార్ లలో వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మాత్రమే అనుమతివ్వాలని తెలిపింది. రెస్టారెంట్లు మాదిరిగానే.. బార్లలోనూ 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ తెరిచేందుకు అనుమతించారు. ఇకపై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒక్కో మండలంలో ప్రతిరోజూ ఒక వీక్లీ మార్కెట్‌ను మాత్రమే అనుమతించనున్నారు.
Next Story