బంగాళాఖాతంలో 'హమూన్ ' తుఫాను
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం తుపానుగా మారిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం తుపానుగా మారిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తుపానుగా మారిన తీవ్రవాయుగుండం.. తీవ్ర తుఫానుగా మారడంతో దీని పేరు 'హమూన్' తుఫానుగా పేరుపెట్టారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాను కేంద్రీకృతమైనట్లు తెలిపింది. అయితే ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తుఫాను ప్రయాణిస్తోందని, ఒడిశా పారాదీప్ కు దక్షిణాన 230 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్ దిగాకు నైరుతి దిశగా 360 కిలోమీటర్ల, బంగ్లాదేశ్ కేపుపర కు 510 కిలోమీటర్ల దూరంలో ఉన్న హమూన్ తుఫాను..
మరో 12 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఈ హమూన్ తుఫాను తీవ్ర తుఫానుగా మారనుందని తెలిపింది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతు ఈనెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ ఖేపు పర - చిట్టగాంగ్ మధ్య తీరం దాటనుంది. ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి బలమైన ఈదురు గాలులు, విశాఖ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టులో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది విశాఖ వాతావరణ కేంద్రం. దీని కారణంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఒడిశా ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేసింది.