Mon Dec 23 2024 13:47:55 GMT+0000 (Coordinated Universal Time)
ఇలా వదిలేసి వెళ్లిపోతావ్ అనుకోలేదు : దీప్ సిద్ధూ ప్రేయసి
నా మనసు ముక్కలైపోయింది. నేను లోలోపలే చచ్చిపోతున్నాను. జీవితంలో ఎప్పుడూ వదిలి వెళ్లనూ అన్నావు.. నీ ప్రాణ ప్రేయసి కోసం
ప్రముఖ నటుడు, సింగర్, ఎర్రకోట హింస కేసులో నిందితుడు అయిన దీప్ సిద్ధూ హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అతను డ్రైవ్ చేస్తున్న స్కార్పియో కారును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టగా.. స్పాట్ లోనే దీప్ సిద్ధూ తీవ్రగాయాలతో మరణించాడు. అతని మరణంపై ఎన్నో అనుమానాలు తలెత్తాయి. కాగా.. అదే ప్రమాదంలో కారులో దీప్ సిద్ధూ పక్కనే కూర్చున్న అతని ప్రేయసి రీనా రాయ్ అదృష్టం కొద్దీ బతికి బయటపడింది. తాజాగా దీప్ సిద్ధూ మరణంపై రీనారాయ్ స్పందించింది.
"నా మనసు ముక్కలైపోయింది. నేను లోలోపలే చచ్చిపోతున్నాను. జీవితంలో ఎప్పుడూ వదిలి వెళ్లనూ అన్నావు.. నీ ప్రాణ ప్రేయసి కోసం తిరిగి వచ్చెయ్. నా ఆత్మ, నా జాను, నా గుండె చప్పుడువు నీవు. ఐ లవ్ యూ. నేను ఆసుపత్రి బెడ్ మీద ఉన్నప్పుడు.. నువ్వొచ్చి నా చెవిలో ఏదో చెబుతున్నట్టు అనిపించింది. ఇద్దరం కలిసి భవిష్యత్ పై ఎన్నెన్ని ఆలోచనలు చేశాం.. ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాం. ఇంతలో ఇలా వదిలేసి వెళ్లిపోయావు. ఐ లవ్ మై జాన్.. నువ్వెప్పుడూ నాతోనే ఉంటావని నాకు తెలుసు. సోల్ మేట్స్ ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు. నేను నిన్ను కలుస్తా" అంటూ రీనారాయ్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టింది. కొద్దిసేపటికే రీనా ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది.
News Summary - Deep Sidhu's Girl friend Reena Rai Shared, Then Deleted Emotional Post
Next Story