Wed Mar 26 2025 17:43:17 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
ఢిల్లీ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాంబ్ స్క్కాడ్ తోనూ తనిఖీలు చేయించారు

ఢిల్లీ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ పోర్టుతో పాటు ఢిల్లీలోని పలు ఆసుపత్రులు, కార్యాలయాలకు ఈ బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టు భద్రత అధికారులు దీంతో అప్రమత్తమయ్యారు. దీంతో పోలీసులు ఢిల్లీ ఎయిర్ పోర్టులో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
క్షుణ్ణంగా తనిఖీలు...
ఢిల్లీ ఎయిర్ పోర్టులో అణువణువునూ పరిశీలించారు. బాంబ్ స్క్కాడ్ తోనూ తనిఖీలు చేయించారు. అయితే ఈ కాల్స్ ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా? లేదా కావాలని చేశారా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విమానాశ్రయానికి చేరుకోవడంలో ఆలస్యమయిన వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా విచారణను ప్రారంభించారు.
Next Story