Mon Dec 23 2024 11:51:55 GMT+0000 (Coordinated Universal Time)
విమానంలో పేలిన మొబైల్ ఫోన్.. పైలట్ ఏమి చేశాడంటే?
ఉదయ్ పూర్ నుండి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలలోనే ఓ పేలుడు సంభవించింది.
ఉదయ్ పూర్ నుండి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలలోనే ఓ పేలుడు సంభవించింది. దీంతో ఏమి జరిగిందా అని అందరూ ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. లోపల పొగలు కూడా వస్తూ ఉండడంతో క్యాబిన్ క్రూ ఈ విషయాన్ని పైలట్ కు తెలియజేశారు. వెంటనే పైలట్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ల్యాండ్ చేసేశాడు. తీరా చూస్తే ఇందుకు కారణం పేలిన మొబైల్ ఫోన్. టేకాఫ్ సమయంలో ఓ ప్రయాణికుడి సెల్ ఫోన్ పేలడంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో పొగలు రావడంతో పైలట్ విమానాన్ని ల్యాండ్ చేశాడు. సమస్యను పరిష్కరించిన తర్వాత గంట వ్యవధిలోనే విమానం ఉదయపూర్ నుంచి బయలుదేరింది.
ఇటీవలి కాలంలో విమానాలు పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ లు చేస్తున్న ఘటనలు విమాన ప్రయాణం చేయాలంటే చాలు భయపడేలా చేస్తున్నాయి. గత నెల జూన్ 21న, ఇండిగో విమానం - 6E 2134 - ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాంకేతిక సమస్య కారణంగా 'వార్నింగ్ సిగ్నల్' వచ్చిన తర్వాత విమానం ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఇండిగో వర్గాలు తెలిపాయి.
Next Story