Fri Dec 20 2024 08:03:00 GMT+0000 (Coordinated Universal Time)
Aravind Kejrival : ఈడీ విచారణకు డుమ్మా
ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరు కావడం లేదు. ఈడీ తనకు ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు
ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హాజరు కావడం లేదు. ఈడీ తనకు ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కేజ్రీవాల్ లేఖ రాశారు. తనను నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా నిరోధించేందుకే నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు.
ప్రచారానికి మధ్యప్రదేశ్ కు...
తనకు ఇచ్చిన నోటీసులో స్పష్టత లేనందున, తాను నాలుగు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించాలని, దీపావళి సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాను అనేక బాధ్యతలను నిర్వహించాల్సి ఉందని ఆయన లేఖలో కోరారు. తాను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలను వదిలి విచారణకు రాలేనని ఆయన తెలిపారు. నోటీసులు ఉపసంహరించుకోవాలని కోరారు. అరవింద్ కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు.
Next Story