Thu Dec 26 2024 17:13:29 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సుప్రీంకోర్టులోనూ కేజ్రీవాల్ కు నిరాశ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులోనూ నిరాశ ఎదురయింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులోనూ నిరాశ ఎదురయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ను హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పు వచ్చే వరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టయి తీహార్ జైలులో ఉన్నారు.
బెయిల్ ఇవ్వడంపై...
ఆయనకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైకోర్టును ఆశ్రయించగా ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే విధించింది. బెయిల్ పై బయటకు రావాల్సిన కేజ్రీవాల్ హైకోర్టు తీర్పుతో రాలేకపోయారు.దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులోనూ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే తాము ఈ కేసును పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.
Next Story