Fri Dec 27 2024 09:04:52 GMT+0000 (Coordinated Universal Time)
బెయిల్ పొడిగించాలంటూ కేజ్రీవాల్ పిటిషన్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగింపు కై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగింపు కై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్ కు జూన్ ఒకటో తేదీ వరకూ సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం కోసం ఈ మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.
జూన్ రెండో తేదీన...
జూన్ రెండో తేదీన జైలు అధికారుల ముందు అరవింద్ కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉంది. అయితే ఆరోగ్య కారణాల రిత్యా మధ్యంతర బెయిల్ ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్ లో కోరారు. తాను తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందువల్ల మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Next Story