Wed Dec 18 2024 22:08:41 GMT+0000 (Coordinated Universal Time)
కేజ్రీవాల్ కు మళ్లీ షాక్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురయింది. ఈరోజు కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లతో కూడిన ధర్మాసనం ఈకేసును విచారించింది. లిక్కర్ కేసులో ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సెప్టంబరు 5వ తేదీకి...
అయితే సీబీఐ తమకు కౌంటర్ దాఖలు చేయడానికి తగిన సమయం ఇవ్వాలంటూ ఆయన న్యాయస్థానాన్ని కోరారు. దీంతో వారం రోజుల పాటు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టంబరు ఐదో తేదీకి వాయిదా వేసింది. ట్రయల్ కోర్టులో ఈడీకేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభించినా సీబీఐ కేసులో రాకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Next Story