Mon Nov 18 2024 09:19:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కేజ్రీవాల్ అరెస్ట్ పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రౌస్ అవెన్యూకోర్టులో హాజరు పర్చారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రౌస్ అవెన్యూకోర్టులో హాజరు పర్చారు. కేజ్రీవాల్ నుం పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. కేజ్రీవాల్ ను తమ కస్టడీకి అప్పగిస్తే మరిన్ని విషయాలను రాబట్టే అవకాశముంటుందని వారు తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్ పై ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు.
రిమాండ్ రిపోర్టులో...
28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందు ఉంచింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. కేజ్రీవాల్ పాత్రపై కల్వకుంట్ల కవిత వాంగ్మూలం తీసుకున్నామని తెలిపింది. ఇది వంద కోట్ల స్కాం కాదని ఆరు వందల కోట్లు అని ఈడీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి వయా గోవా టు ఢిల్లీకి ఈ డబ్బులు పంపారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
Next Story