Thu Dec 19 2024 04:09:35 GMT+0000 (Coordinated Universal Time)
Aravind Kejrival : నేడు ఈడీ ఎదుటకు కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ కేజ్రీవాల్ ను విచారణ చేయనుంది. అయితే ఆయనను అరెస్ట్ చేస్తారంటూ పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే కేజ్రవాల్ కు నోటీసులు జారీ చేశారు. నవంబరు 2వ తేదీన విచారణకు ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని కోరారు.
అరెస్ట్ చేస్తారంటూ...
అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పలువురు అరెస్టయిన నేపథ్యంలో కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పెద్దయెత్తున పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఈడీ అధికారులు ఈరోజు కేజ్రీవాల్ ను ప్రశ్నించి వదిలేస్తారని కొందరు భావిస్తున్నారు. ఢిల్లీలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది.
Next Story