Mon Dec 23 2024 06:01:11 GMT+0000 (Coordinated Universal Time)
Aravind Kejrival : కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు.. తీహార్ జైలుకు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పథ్నాలుగు రోజుల పాటు కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. కేజ్రీవాల్ కస్టడీ ముగియడంతో సీీబీఐ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపర్చారు. సీబీఐ తరుపున న్యాయవాదులు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
పథ్నాలుగు రోజులు...
దీంతో పథ్నాలుగు రోజుల పాటు అరవింద్ కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత సీబీఐ కూడా ఈ కేసును విచారిస్తోంది. జ్యుడిషియల్ కస్టడీకి విధించడంతో కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు అధికారులు తరలించారు.
Next Story