Mon Dec 23 2024 09:21:23 GMT+0000 (Coordinated Universal Time)
Aravind Kejrival : నేడు న్యాయస్థానానికి కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో ఈరోజు ఆయనను న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
తీహార్ జైలులో ఉన్న...
మార్చి 21న ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. ఈరోజుతో జ్యుడిషియల్ కస్టడీ ముగియనుండటంతో కేజ్రీవాల్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరే అవకాశముంది. ప్రస్తుతం పథ్నాలుగు రోజుల నుంచి తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలన్న పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
Next Story