Mon Dec 23 2024 05:36:41 GMT+0000 (Coordinated Universal Time)
నా భర్త నిజమే చెబుతాడు... అబద్ధం చెప్పడు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత ఆయన అరెస్ట్పై సంచలన కామెంట్స్ చేశారు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత ఆయన అరెస్ట్పై సంచలన కామెంట్స్ చేశారు. ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో మాట్లాడిన సునీత పలు ఆసక్తికరమైన అంశాలను తెలిపారు. తన భర్త గురువారం లిక్కర్ స్కామ్ లో వాస్తవాలను కోర్టులో చెప్పనున్నారన్నారు. గురువారం కోర్టులో కేజ్రీవాల్ పిటీషన్ పై విచారణ జరగనున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అక్రమంగా అరెస్ట్ చేసి...
తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారని, ఆయన డయాబెటీస్ తో బాధపడుతున్నారని, ఆరోగ్యం సరిగా లేదని, అయినా కనికరం చూపించకుండా అరెస్ట్ చేశారని సునీత అన్నారు. జైల్లో ఉన్న శరీరం అక్కడ ఉంది కాని, కేజ్రీవాల్ మనసంతా ఢిల్లీ ప్రజల సమస్యలపైనే ఉందన్నారు. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ అరెస్ట్ తో ఆందోళనకు గురవుతున్నారన్నారు.
Next Story