Mon Dec 23 2024 01:07:57 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను మనీలాండరింగ్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుపడుతూ ఈ పిటీషన్ వేశారు. తన కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ పిటిషన్ పై సమాధానానికి ఎన్ఫోర్స్:మెంట్ డైరెక్టరేట్ అధికారులకు ఢిల్లీ హైకోర్టు సమయం ఇచ్చింది.
తన అరెస్ట్...
తన అరెస్టు, ఈడీ కస్టడీ చట్టవిరుద్ధమని పిటిషన్ లో కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.
Next Story