Mon Dec 23 2024 01:36:36 GMT+0000 (Coordinated Universal Time)
Delhi Gym Trainer Case:తండ్రిని చెంప దెబ్బ కొట్టిన కొడుకు.. చివరికి!!
ఢిల్లీలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల యువకుడిని అతడి
Delhi Gym Trainer Case:ఢిల్లీలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల యువకుడిని అతడి తండ్రే దారుణంగా హత్య చేశాడు. కొడుకు పెళ్ళికి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉండగా.. ఈ హత్యకు తెగబడ్డాడు. యువకుడికి అతడి తండ్రితో పెద్దగా అనుబంధం లేదు. తన భార్యకు తగిన గుణపాఠం చెప్పాలనే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. మూడు, నాలుగు నెలలుగా హత్యకు ప్లాన్ వేసినట్లు విచారణలో తేలింది. ఫిబ్రవరి 6-7 రాత్రి నేరం చేసి ఢిల్లీ నుండి పారిపోయిన 54 ఏళ్ల నిందితుడు రంగ్ లాల్‌ను జైపూర్‌లో అరెస్టు చేశారు.
జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్‌ను అతని తండ్రి రంగ్ లాల్ అతి దారుణంగా చంపాడు. దక్షిణ ఢిల్లీలోని గౌరవ్ సింఘాల్ ఇంట్లో ముఖం, ఛాతీపై 15 సార్లు కత్తితో పొడిచారు. ఫిబ్రవరి 7వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో గౌరవ్ సింఘాల్ రక్తపు మడుగులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా.. రంగ్ లాల్ ఈ హత్యను చేశాడని అనుమానాలు బలపడ్డాయి. అతను పారిపోవడమే కాకుండా.. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని ధృవీకరించామని దక్షిణ ఢిల్లీ డిసిపి అంకిత్ చౌహాన్ తెలిపారు. విచారణలో నిందితుడు ఈ హత్యను చేసినట్లు ఒప్పుకున్నాడు. తన భార్య, కొడుకుతో సంబంధం సరిగా లేదని తేలింది. తన భార్యకు గుణపాఠం చెప్పడానికి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులు ఎవరి దృష్టిని మరల్చకుండా పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ.75,000 చెల్లించి ముగ్గురు సహచరులను నియమించుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం రాత్రి కొడుకు, తండ్రి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది, ఈ సమయంలో గౌరవ్ తన తండ్రిని చెంపదెబ్బ కొట్టాడు. ఆ తర్వాతే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. గత మూడు, నాలుగు నెలలుగా కుమారుడిని హత్య చేయాలని తండ్రి ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. అరెస్ట్ చేసే సమయంలో అతని వద్ద రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.15 లక్షల నగదు ఉన్నాయని, వాటితో ఇంటి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
Next Story