Fri Nov 22 2024 08:31:34 GMT+0000 (Coordinated Universal Time)
మనీశ్ సిసోడియాకు షాకిచ్చిన హైకోర్టు
లిక్కర్ కేసులో మనీశ్ కు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. మనీశ్ బెయిల్ పిటిషన్ ను జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. లిక్కర్ కేసులో మనీశ్ కు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. మనీశ్ బెయిల్ పిటిషన్ ను జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ సింగిల్ బెంచ్ తిరస్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి దినేశ్ కుమార్ శర్మ తీర్పు వెలువరించారు. మనీశ్ సిసోడియా బెయిల్ పై విడుదలైతే.. ఆయనకున్న పలుకుబడితో సాక్షులను ప్రభావితం చేయగలరని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ పై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని తెలిపింది.
ఢిల్లీ హైకోర్టు మనీశ్ బెయిల్ ను నిరాకరించడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని ఆప్ వర్గాలు వెల్లడించాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా.. తొలుత సీబీఐ కస్టడీకి అప్పగించింది. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో మనీశ్ సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు. జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 1 వరకూ పొడిగించింది. జ్యుడీషియల్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో సిసోడియా బెయిల్ కు అప్పీల్ చేసుకోగా.. దానిని ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
Next Story