Mon Dec 23 2024 08:51:58 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కేజ్రీవాల్ కు షాకింగ్ .. బెయిల్ వచ్చినా?
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చింది
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించి బెయిల్ పొందవచ్చని తెలిపింది. దీంతో ఆయన ఈరోజు బెయిల్ పై తీహార్ జైలు నుంచి విడుదలవుతారని భావించారు.
ఈడీ పిటీషన్ తో...
కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తే సాక్షులను తప్పుదోవ పట్టిస్తాని కూడా ఈడీ హైకోర్టుకు తెలిపింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంతో అరవింద్ కేజ్రీవాల్ నేడు తీహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.
Next Story