Mon Dec 23 2024 09:30:16 GMT+0000 (Coordinated Universal Time)
బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొలగింపు
భారత రాష్ట్ర సమితి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు
భారత రాష్ట్ర సమితి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారంటూ వాటిని తొలగించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రారంభించనున్నారు.
రేపు ప్రారంభం...
ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ముందు పెద్దయెత్తున నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతోనే వాటిని తొలగించడం జరిగిందని మున్సిపల్ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Next Story