Mon Dec 23 2024 13:23:08 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని ఢిల్లీలో హై అలర్ట్
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. హై అలర్ట్ ప్రకటించారు.
స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. హై అలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీన దాడులకు, అల్లర్లకు పాల్పడే అవకాశముందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికతో ఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు. పదివేల మంది పోలీసులను మొహరించారు. గాలిపటాలు, బెలూన్ల వంటి వాటివి ఎగుర వేయకుండా దాదాపు 400 మంది సైనికులు పహారా కాస్తున్నారు.
నో ఫ్లయింగ్ జోన్...
ఎర్రకోట చుట్టూ ఎత్తయిన భవనాల పైన షార్ప్ షూటర్లను మొహరించారు. ఎర్రకోట ప్రాంతంలో నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించారు. ఎటువంటి గాలిపటాలు, బెలూన్లను ఎగురవేయడం నిషిద్ధమని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సైనికులతో పాటు, పోలీస్ కమాండోలు పహారా కాస్తున్నారు. అత్యాధునిక సీసీ కెమారాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 13 నుంచి ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story