Sun Dec 22 2024 23:47:16 GMT+0000 (Coordinated Universal Time)
Delhi Liqour Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురికి బెయిల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముగ్గురు నిందితులకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముగ్గురు నిందితులకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంటి వారు తీహార్ జైలులో ఉన్నారు.
ఈడీ అరెస్ట్ చేసిన...
అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముగ్గురికి రౌస్ అవెన్యూ కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దామోదర్, ప్రిన్స్, అరవింద్ సింగ్ కు బెయిల్ ఇచ్చింది. అయితే, వీరిని కవితకు సంబంధించిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ లో నిందితులుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేర్చింది. దీనిపై జూలై 3వ తేదీన విచారణ జరగనుంది.
Next Story