Sun Nov 17 2024 22:36:46 GMT+0000 (Coordinated Universal Time)
అందనంత దూరంలో పసిడి
బంగారాన్ని అమితంగా ప్రేమించే వారు ఎక్కువగా ఉన్న భారత్ లో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. విలువలో తరుగుదల ఉండదు.
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో? ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం. అందుకే ఎప్పుడు డబ్బులుంటే అప్పుడే కొనుగోలు చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. ధరలతో సంబంధం లేదు. ఒక గ్రాము అటు ఇటు అటు అయినా పరవాలేదు కాని తమకు నచ్చిన డిజైన్ల కోసం నాలుగు షాపులు తిరిగి మరీ బంగారాన్ని కొనుగోలు చేస్తారు. బంగారం ధరలు కేంద్ర బ్యాంకుల్లో నిల్వలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలపై ఆధారపడి ఉంటాయి. అయినా ఎవరూ ధరలను గురించి పెద్దగా పట్టించుకోరు. బంగారాన్ని అమితంగా ప్రేమించే వారు ఎక్కువగా ఉన్న భారత్ లో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. విలువలో తరుగుదల ఉండదు.
వెండి కూడా...
గత రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.400లు పెరిగింది. వెండి కూడా అదే బాటలో పయనిస్తుంది. వెండి కిలోకు రూ. 300లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,660 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,750 రూపాయలు పలుకుతుంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ లో 67,000 రూపాయలుగా ఉంది.
Next Story