Mon Dec 23 2024 01:44:28 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : డిప్యూటీ సీఎంగా ఫడ్నవిస్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చివరి నిమిషంలో మరలా స్ట్రాటజీ మారింది. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని పార్టీ హైకమాండ్ సూచించడంతో దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మంత్రి వర్గంలోనూ....
మంత్రివర్గంలోనూ బీజేపీ చేరనుంది. బయట నుంచి మద్దతు తెలుపుతామని ఫడ్నవిస్ వ్యాఖ్యానించిన గంటలోపే సీన్ మారింది. ఇప్పుడు షిండే మంత్రివర్గంలో బీజేపీ చేరాలన్న నిర్ణయం తీసుకుంది. జాతీయ నాయకత్వం ఫడ్నవిస్ ను బలవంతంగా ఒప్పించింది. మరికొద్దిసేపట్లో షిిండే, ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Next Story