Sun Dec 22 2024 17:57:50 GMT+0000 (Coordinated Universal Time)
Maharashtra : నేడు మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు దేవేంద్ర ఫడ్నివిస్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు దేవేంద్ర ఫడ్నివిస్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. సాయంత్రం ముంబయిలోని ఆజాద్ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పది రోజుల క్రితం మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పటికీ మహాయుతి నేతల్లో ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయం కాలేదు. చివరకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల జోక్యంతో ముఖ్యమంత్రి పదవి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ కు ఖరారయింది. నిన్న జరిగిన బీజేపీ శాసనసభ పక్ష సమావేశంలో ఫడ్నవిస్ ను బీజేపీ ఎమ్మెల్యేలు తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
ఉపముఖ్యమంత్రులుగా...
ఈరోజు ఉప ముఖ్యమంత్రులుగా ఏక్ నాధ్ షిండే, అజిత్ పవార్ లు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబయిలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. మొన్నటి ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమి వన్ సైడ్ విజయం సాధించిన నేపథ్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చే అవకాశముంది. భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.
Next Story