Wed Apr 09 2025 02:53:45 GMT+0000 (Coordinated Universal Time)
Sabarimala : లక్షల్లో భక్తులు.. దర్శనానికి పథ్నాలుగు గంటల సమయం
శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు

శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. మండల పూజ కోసం అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు అయ్యప్ప కొండకు చేరుకుంటున్నారు. పంబలో స్నానాలు చేసి కొండకు చేరుకుని భక్తులు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
బారులు తీరి...
దాదాపు పన్నెండు నుంచి పథ్నాలుగు గంటల సమయం అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు సమయం పడుతుంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. దీంతో శబరిమల భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో కొండ మార్మోగిపోతుంది.
Next Story