Thu Dec 26 2024 13:27:29 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : భవ్యరామాలయంలో సూర్యకిరణాలు
అయోధ్యలో భక్తులు పులకించిపోయారు. బాలరాముడికి సూర్యతిలకం చూసి పరవశించిపోయారు.
అయోధ్యలో భక్తులు పులకించిపోయారు. బాలరాముడికి సూర్యతిలకం చూసి పరవశించిపోయారు. శ్రీరామనవమి సందర్భంగా బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడేలా అధునాతన టెక్నాలజీతో చేసిన కార్యక్రమం విజయవంతమయింది. బాలరాముడి నుదుటను తిలకం దిద్దినట్లు సూర్యకిరణాలు పడటంతో భక్తులు రామయ్యను చూసి భక్త పారవశ్యంలో మునిగిపోయారు.
అద్భుతమైన దృశ్యాన్ని...
అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. నాలుగు నిమిషాల పాటు సూర్యతిలకం బాలరాముడి నుదుటిపై పడింది. మూడో అంతస్థులో సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి శ్రీరామనవమికి ఇలాగే సూర్యతిలకం దిద్దేలా ఏర్పాటు చేస్తామని రామతీర్థ ట్రస్ట్ తెలియజేసింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో నేడు అయోధ్య కిటకిటలాడిపోతుంది. శ్రీరామనవమి వేడుకను ఆలయంలో ఘనంగా నిర్వహించారు.
Next Story