Thu Apr 03 2025 18:55:29 GMT+0000 (Coordinated Universal Time)
Sabarimala : అయ్యప్ప దర్శనానికి పదిహేను గంటలు.. పోటెత్తిన భక్తులు
శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయ్యప్ప దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతుంది

శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మండల పూజలకు ముందే అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు తరలి రావడంతో శబరిమల కొండలు స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగుతున్నాయి. భక్తులు ఒక్కసారిగా రావడంతో రద్దీ ఏర్పడి దర్శనానికి ఎక్కువ సమయం పుడుతుందని అక్కడి ట్రావెన్ కోర్ ట్రస్ అధికారులు చెబుతున్నారు. అయితే వచ్చిన భక్తులందరీకీ దర్శనం కల్పిస్తామని వారు చెబుతున్నారు.
కనీస సౌకర్యాలు...
మరోవైపు శబరిమల సన్నిధానంలో మండల పూజ నుంచి టిక్కెట్లను ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారికే దర్శనం అన్న షరతును విధించడంపై కొంత సందిగ్దత నెలకొన్న నేపథ్యంలో ఈరోజు రష్ కొనసాగుతుంది. శబరిమల సన్నిధానంలో తుల మాస పూజల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. అయితే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో బోర్డు విఫలమయిందని భక్తులు చెబుతున్నారు. అయ్యప్ప దర్శనానికి సుమారు 10 గంటల నుండి 15 గంటల సమయం పడుతుంది. దీంతో క్యు లైన్లలోనే ఉన్న భక్తులు చాల మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారని చెబుతున్నారు.
Next Story