Sat Dec 28 2024 11:33:48 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : ఒక్కరోజులో ఇంత మంది దర్శించుకున్నారా.. రామా?
అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు క్యూ కడుతున్నారు
అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు క్యూ కడుతున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అయోధ్య వీధులన్నీ శ్రీరామ నామ స్మరణతో మారుమోగిపోతుంది. నిన్న బాలరాముడిని(బాలక రామ్) ఐదు లక్షల మంది దర్శించుకున్నారని ఆలయ బోర్డు తెలిపింది. తెల్లవారు జామున మూడు గంటల నుంచే బాలఖ్ రాముడి దర్శనం కోసం బారులు తీరారు.
నేడు మూడు లక్షల మంది....
నేడు మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకూ, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఏడు గంటల వరకూ మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తున్నారు. అయోధ్యలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఎనిమిది వేల మంది పోలీసులు పహారా కాస్తున్నారు.
Next Story