Mon Dec 23 2024 02:49:28 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : తొలి రోజు అయోధ్యలో దర్శనానికి?
అయోధ్యలో రామాలయంలో నేటి నుంచి సామాన్య భక్తులకు దర్శనం లభించనుంది. దీంతో అత్యధిక సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకున్నారు.
అయోధ్యలో రామాలయంలో నేటి నుంచి సామాన్య భక్తులకు దర్శనం లభించనుంది. దీంతో అత్యధిక సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలో రాములోరిని దర్శించుకునేందుకు నేటి నుంచి సామాన్య భక్తులకు అనుమతి ఇస్తుండటంతో పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకోవడంతో కిటకిటలాడిపోతుంది. పెద్ద సంఖ్యలో అయోధ్యలో భక్తులు బారులు తీరారు. అయోధ్యలోని వీధులన్నీ భక్తులతో కిటికిటటాడిపోతున్నాయి. హోటళ్లన్నీ ముందుగానే బుక్ అయ్యాయి.
రెండు విడతలుగా...
అయోధ్యలో ఎక్కడ విన్నా రామనామ స్మరణే వినపడుతుంది. బాలరాముడి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. సుమారు ఆరు గంటల సమయం పడుతుంది. అయితే బాలరాముడిని దర్శించుకోవడానికి ఉదయం ఏడు గంటల నుంచి 11.30 గంటల వరకూ మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ మాత్రమే భక్తులకు అనుమతి ఇస్తారు. దీంతో భక్తులు ఈరోజే దర్శనం చేసుకోవడానికి క్యూ కట్టారు.
Next Story