Tue Dec 24 2024 00:53:09 GMT+0000 (Coordinated Universal Time)
బహిరంగ మార్కెట్లోకి కొవాగ్జిన్, కొవిషీల్డ్.. ధరలిలా ఉండొచ్చు!
ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవాగ్జిన్ రూ.1200, కొవిషీల్డ్ రూ.780కి లభిస్తున్నాయి. ఇప్పటివరకూ ఆస్పత్రులకే పరిమితమైన
కరోనాను అడ్డుకోవాలంటే.. వ్యాక్సినేషన్ తప్పనిసరి అని అన్ని దేశాలు బలంగా నమ్ముతున్నాయి. అందుకే అన్ని దేశాల్లోనూ వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశాలు.. ఇప్పుడు బూస్టర్ డోసులను వేస్తున్నాయి. భారత్ లో కరోనా ను అడ్డుకునేందుకు రెండు టీకాలను ప్రధానంగా వాడుతున్నారు. అవే.. కొవాగ్జిన్, కొవిషీల్డ్. ఈ రెండింటిలో ఏ టీకా వేయించుకున్నా అవి.. యాంటిబాడీలను ఉత్పత్తి చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు.
Also Read : కనుమరుగు కానున్న కడప.. ఇక చరిత్రకే పరిమితమా !
తాజాగా బహిరంగ మార్కెట్లో ఈ రెండు టీకాల ధరలు ఖరారైనట్లు తెలుస్తోంది. ఒక్కో డోసు ధర రూ.275 వరకూ ఉండవచ్చని సమాచారం. సర్వీస్ ఛార్జీల రూపంలో మరో రూ.150 అదనంగా వసూలు చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవాగ్జిన్ రూ.1200, కొవిషీల్డ్ రూ.780కి లభిస్తున్నాయి. ఇప్పటివరకూ ఆస్పత్రులకే పరిమితమైన ఈ రెండు టీకాలను.. బహిరంగ మార్కెట్లో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. సదరు రెండు సంస్థలు డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. దరఖాస్తులను పరిశీలించిన కోవిడ్ -19 నిపుణుల కమిటీ షరతులతో కూడిన అనుమతులివ్వొచ్చని తెలిసింది. అయితే బహిరంగ మార్కెట్లో ఒక్కో డోసును ఎంత ధరకు విక్రయించాలన్నదానిపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) కసరత్తు ప్రారంభించింది.
Next Story