Tue Nov 05 2024 19:52:06 GMT+0000 (Coordinated Universal Time)
బక్రీద్ ఎప్పుడు ? క్లారిటీ ఇచ్చిన ముస్లిం మతపెద్దలు
బక్రీద్ పండుగను త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ బక్రీద్ పండుగనే ‘ఖుర్బీనా పండుగ’ లేదా ఈద్ అల్-అధా అని కూడా పిలుస్తారు
దేశవ్యాప్తంగా బక్రీద్ ఎప్పుడు జరుపుకోవాలా అనే కన్ఫ్యూజన్ ఇన్ని రోజులూ ప్రజలలో ఉండేది. అయితే ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది. జూన్ 28 జరుపుకోవాలా.. జూన్ 29న జరుపుకోవాలా అనే విషయంపై తాజాగా ముస్లిం పెద్దలు స్పందించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 29న బక్రీద్ (ఈద్ ఉజ్ జూహా) పండుగ జరుపుకోవాలని రుహియ్యతే హిలాల్ (నెలవంక నిర్ధారణ కమిటీ) ప్రతినిధి ముఫ్తీ సయ్యద్ తెలిపారు. 28న ఆరఫత్ రోజున ఉపవాసం పాటించాలని సూచించారు. ఈ క్రమంలో సామూహిక నమాజ్ కోసం ఈద్గాలు, మసీదుల్లో ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులను కోరారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో అధికారులు ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.
బక్రీద్ పండుగను త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ బక్రీద్ పండుగనే ‘ఖుర్బీనా పండుగ’ లేదా ఈద్ అల్-అధా అని కూడా పిలుస్తారు. రంజాన్ తర్వాత వచ్చే ఇస్లామిక్ క్యాలెండర్ లో ముఖ్యమైన నెలల్లో ఈ నెల ఒకటి. పవిత్ర రంజాన్ మాసం ముగిసిన 70 రోజుల తర్వాత బక్రీద్ ను జరుపుకుంటారు. ఈనెలలోనే ముస్లింలు హజ్ యాత్రను చేస్తారు. అల్లాహ్ ఆదేశం ప్రకారం హజ్రత్ ఇబ్రహీం తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్దపడతాడు.ఆ క్షణంలో అల్లా తన దూతను పంపి అతడి కొడుకు స్థానంలో మేకను పెట్టాడని చెబుతారు. అప్పటి నుండి బక్రీద్ రోజున మేకను బలి ఇచ్చే సంప్రదాయం ప్రారంభమైంది. బలి అనంతరం ఆ మాంసాన్ని మూడు భాగాలు చేస్తారు. ఇందులో మొదటి భాగాన్ని బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారికి అందజేస్తారు. రెండవ భాగం పేదల కోసం, చివరి మరియు మూడవ భాగం కుటుంబం కోసం ఉంచుకుంటారు. హజ్ యాత్రకోసం ముస్లింలందరూ సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి వెళ్తారు.
Next Story