Sun Dec 22 2024 16:02:24 GMT+0000 (Coordinated Universal Time)
దేశవ్యాప్తంగా బాణాసంచా కాల్చడంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
దీపావళి, ఇతర సందర్భాల్లో బాణాసంచా పేల్చకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆదేశాలను పాటించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.
దీపావళి, ఇతర సందర్భాల్లో బాణాసంచా పేల్చకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ఆదేశాలను పాటించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. బాణాసంచా పేల్చడంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన పిటిషన్లను న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనం విచారించింది.
దేశంలో బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లు, వినియోగంపై బ్యాన్ కోరుతూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. రాజస్థాన్ కు చెందిన పిటిషనర్ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. దీపావళి వేడుకల్లో బాణాసంచాపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కేవలం ఢిల్లీకే పరిమితం అనుకుంటున్నారని పిటిషనర్ తెలిపారు. ఈ తీర్పు దేశమంతటా వర్తిస్తుందని అందరికీ తెలియాలని కోరారు. ఆస్పత్రులు, పాఠశాలలు వంటి ప్రాంతాల్లోనైనా బాణాసంచా వినియోగం లేకుండా నిషేధం విధించాలని కోరారు పిటిషనర్.
ముఖ్యంగా పండుగ సీజన్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ రాష్ట్రానికి న్యాయస్థానం సూచించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను గమనించాలని కోరింది. ముఖ్యంగా ప్రజలను చైతన్యవంతులను చేయడమే కీలకమని ధర్మాసనం అభిప్రాయపడింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపివేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ విషయమై బుధవారం ఢిల్లీతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రతినిధులు సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.
Next Story