Sun Dec 22 2024 23:33:59 GMT+0000 (Coordinated Universal Time)
షిండే కీ కామెంట్స్.. ఎవరితోనూ టచ్ లో లేరు
అసంతృప్త నేత ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు షిండే కౌంటర్ ఇచ్చారు
అసంతృప్త నేత ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు షిండే కౌంటర్ ఇచ్చారు. తమదే అసలైన శివసేన అని వ్యాఖ్యానించారు. బాల్థాక్రే హిందుత్వ నినాదాన్ని తామే ముందుకు తీసుకెళతామని చెప్పారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ ఎవరితోనూ టచ్ లో లేరని చెప్పారు. తమకు యాభై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న షిండే తమదే అసలైన పార్టీ అని చెప్పారు.
మాదే అసలైన శివసేన...
గౌహతిలో రెబల్ ఎమ్మెల్యేలతో సమావేశమైన షిండే భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. గవర్నర్ బలపరీక్ష పెడితే తాము అందుకు సిద్ధమని చెప్పారు. తమకు విప్ జారీ చేసే అధికారం ఎవరికీ లేదన్నారు. తామే శివసేన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయననున్నామని ఆయన తెలిపారు. కొద్ది గంటల్లోనే సీన్ మారుతుందని షిండే వ్యాఖ్యానించారు.
Next Story