Mon Dec 23 2024 20:28:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సోనియాతో ఆజాద్ భేటీ?
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నేడు అసంతృప్త నేత గులాం నబీ ఆజాద్ సమావేశం కానున్నారు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నేడు అసంతృప్త నేత గులాం నబీ ఆజాద్ సమావేశం కానున్నారు. నిన్న సమావేశమైన జీ 23 నేతలు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఏం చేయాలన్న దానిపై వారు మేధోమధనం జరిపారు. దీంతో పాటు కాంగ్రెస్ విధానాలకు దగ్గరగా ఉంటే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని జీ 23 నేతలు అభిప్రాయపడ్డారు.
జీ 23 సమావేశంలో...
కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకూ సమిష్టిగా పోరాడితేనే 2024లో బీజేపీని గద్దె దించగలమని అసంతృప్త నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని కడా నియమించాలని వారు కోరుతున్నారు. తాము జరిపిన సమావేశంలో వెలువడిన అభిప్రాయాలను నేడు సోనియాగాంధీకి గులాం నబీ ఆజాద్ వివరించనున్నారు. ఈ మేరకు సోనియా అపాయింట్ మెంట్ ను కూడా ఆజాద్ కోరినట్లు తెలిసింది.
Next Story