Mon Dec 23 2024 12:06:14 GMT+0000 (Coordinated Universal Time)
డ్రైవర్ ను పెళ్లాడిన మంత్రి కూతురు.. ట్విస్ట్ ఏంటంటే !
అందుకు మంత్రి పీకే శేఖర్ అంగీకరించలేదు. పైగా సతీష్ దళితుడు, డ్రైవర్ కావడంతో పెళ్లి చేయనని చెప్పేశారు. ఆ తర్వాత రెండునెలల
చెన్నై : ఓ మంత్రి కూతురు డ్రైవర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సినిమాటిక్ గా జరిగిన ఈ లవ్ స్టోరీ, పెళ్లిలో ట్విస్ట్ ఏంటంటే.. తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారని మంత్రి ఫిర్యాదు చేయడం. కూతురు పక్క రాష్ట్రానికి వెళ్లి, తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది. అనంతరం తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందంటూ ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు కుమార్తె జయకల్యాణి తమ ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్న సతీష్ అనే వ్యక్తితో ఆరేళ్లుగా ప్రేమలో ఉంది. గతేడాదే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించి.. తండ్రికి ప్రేమ విషయం చెప్పింది.
అందుకు మంత్రి పీకే శేఖర్ అంగీకరించలేదు. పైగా సతీష్ దళితుడు, డ్రైవర్ కావడంతో పెళ్లి చేయనని చెప్పేశారు. ఆ తర్వాత రెండునెలల పాటు స్థానిక పోలీసుల సహాయంతో సతీష్ ను నిర్భందించాడు. ఆ సమయంలో సతీష్, జయకల్యాణి మైనర్లు కావడంతో ఎవరూ ఏం మాట్లాడలేదు. పోలీసుల నిర్భంధం నుంచి బయటకు వచ్చిన తర్వాత సతీష్ జరిగిన ఘటన గురించి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో మీడియాలో వైరల్ య్యింది. ఇప్పడు ఇద్దరూ మేజర్లు కావటంతో బెంగుళూరులోని ఒక సామాజిక కార్యకర్త సహాయంతో మార్చి 7వ తేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి అనంతరం.. తనకు, తన భర్తకు తండ్రి శేఖర్ నుంచి ప్రాణ హాని ఉందని, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపింది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ వ్యవహారం ఎంతవరకూ దారితీస్తుందో చూడాలి. మంత్రి గారి కుమార్తె విషయం కావడంతో పోలీసులు సున్నితంగా డీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story